కొత్త గెటప్ వెనుక జగన్ అసలు కధ(వీడియో)

Jagan new getup

11:41 AM ON 11th August, 2016 By Mirchi Vilas

Jagan new getup

ఎవరు ఎన్ని చెప్పినా గ్రహశాంతి, పూజలు, హోమాలు చేయించుకోవడం సహజం. కానీ ఫక్తు ఓ ముద్ర పడిన విపక్ష నేత జగన్ రిషికేష్ యాత్రపై అప్పుడే వింత వింత వార్తలు కొందరికి అంతుబట్టడం లేదట. శారదా స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో జగన్ పాల్గొని, ఏపీకి మంచి జరగాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నట్లు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాదు. అక్రమాస్తుల కేసుల ఉచ్చు నుంచి తనను విడదియ్యమనే దేవుణ్ణి వేడుకున్నారని తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక జగన్ తో పాటు ఎమ్.పిలు అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి కూడా పాల్గొన్న ఈ పూజల వెనుక వేరే కథ ఉందంటూ సెటైర్లు పడిపోతున్నాయి.

1/3 Pages

కృష్ణా పుష్కరాల పేరుతో ఇటు చంద్రబాబు హిందువుల మనోభావాలను కొల్లగొడుతుంటే, జగన్ కు కన్నుకుట్టిందని, అందుకే రిషీకేశ్ వెళ్లి పూజలు పునష్కారాలంటూ హడావిడి చేసుకున్నారని కొన్ని వెబ్ సైట్స్ లో కధనాలు వస్తున్నాయి. ఇక చంద్రబాబుతో బీజేపీ బంధం తెగిపోయే వాతావరణం కనిపిస్తుండడంతో.. ఈవిధంగా హిందుత్వ వాసనలు గుప్పించి కమలం పార్టీకి దగ్గరవ్వొచ్చని జగన్ భావిస్తున్నట్లు ఇంకోవైపు నుంచి రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద పంచె కట్టుతో, కొత్త గెటప్ లో కనిపించిన యువనేత ఒకరకంగా సంచలనమే క్రియేట్ చేశారని చెప్పవచ్చు.

English summary

Jagan new getup