మొన్న గోల్ఫ్... నిన్న చెస్.. జగన్ రూటే వేరు

Jagan playing chess

01:10 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Jagan playing chess

పార్టీలో ఇబ్బందికర పరిణామాలని ఫేస్ చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం ఫారెన్ టూర్ లో డిఫరెంట్ కారెక్టర్ లో వున్నారు. అందుకే ఏదోవిధంగా వార్తల్లోకి వస్తూనే వున్నారు. మొన్న స్టిక్ పట్టుకుని గోల్ఫ్ మైదానంలో కనిపించగా, ఈసారి చెస్... అది కూడా.. ఎవరి మీదకో యుద్ధానికి వెళ్లినట్టు సీరియస్ గా ఆలోచిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేసున్నట్టు ఉంది. సమయం, సందర్భం అనేది పక్కనబెడితే.. చెస్ గేమ్ లో జగన్ సీరియస్ గా ఆలోచిస్తూ ప్లాన్ చేస్తున్నట్లు వుంది. ఇంతకీ జగన్ కు ఆపోజిట్ ఎవరు? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. నార్మల్ గా రాజకీయాల్లో అయితే జగన్ కు ప్రత్యర్థిగా చంద్రబాబుని చెప్పుకుంటున్నారు.

కానీ ఈ గేమ్ లో ఎవరో? అనేది తెలియాలంటే ఓపిక పట్టాలి మరి. ఇక ఇది పక్కన పెడితే, ఏపీలో హాట్ హాట్ గా రాజకీయాలుంటే, అక్కడెక్కడో, తాపీగా కూర్చుని చెస్ ఆడడమేమిటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎవరేమనుకున్నా జగన్ కి ఇదో ఆటవిడుపు.

English summary

Jagan playing chess