గౌతమీ పుత్రపై జగన్ ఖండన

Jagan reveal Gouthamiputra satakarni graphics

06:26 PM ON 2nd November, 2016 By Mirchi Vilas

Jagan reveal Gouthamiputra satakarni graphics

నందమూరి నటసింహం బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ గ్రాఫిక్స్ రూమర్లపై వస్తున్న వార్తలను బాలకృష్ణ ఫ్యాన్స్ ఖండించింది. తమ అభిమాన హీరోపై కావాలని ఎవరో రాద్దాంతం చేస్తున్నారని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. ఇంటర్నేషనల్ స్థాయిలో చేయించాల్సిన గ్రాఫిక్స్ ని స్థానికులతో చేయిస్తున్నారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మవద్దని ఆన్ లైన్ మీడియాకి విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే శాతకర్ణి మూవీ బిజినెస్ క్లోజ్ అయ్యిందని, ఇలాంటి వార్తలతో బయ్యర్స్ లో ఆందోళన క్రియేట్ చేయవద్దని హితవు పలికాడు.

1/3 Pages

రెమ్యునరేషన్ తగ్గింపు...


కాగా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి రోజూ రకరకాల న్యూస్ వస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఇది బాలకృష్ణ వందో సినిమా కాబట్టి భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ మూవీ బడ్జెట్ 70-80 కోట్లు వుందట. ఇక బడ్జెట్ ఈ రేంజ్ ఉండే సినిమాల్లో హీరోలు కనీసం 15-20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే బాలయ్య శాతకర్ణి సినిమాకి కేవలం 8 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నాడట.

English summary

Jagan reveal Gouthamiputra satakarni graphics