జగన్ అలా అనేశాడేంటి

Jagan shared his feelings

02:19 PM ON 27th January, 2017 By Mirchi Vilas

Jagan shared his feelings

ఇప్పటి రాజకీయాల్లో సహనం కనిపించడం లేదని పలువురు అనేమాట. అయితే వైసిపి నేత జగన్ గురించి టీడీపీ పదేపదే ఇలాంటి విమర్శలతోనే తిప్పికొడుతోంది కూడా. తాజాగా జగన్ పోలీసులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి. ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కేబీచ్ లో చేపట్టనున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందకు ప్రతిపక్షనేత జగన్ గురువారం విశాఖ చేరుకున్నారు. అయితే, ఆర్కేబీచ్ లో ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు జగన్ ను విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై ప్రతిపక్షనేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. విమానంలో ప్రయాణికుడిగా వచ్చిన నన్ను ఎందుకు ఆపుతున్నారు? రెండేళ్లలో సీఎం అవుతా.. మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటా.. అందరి పనీ చెబుతా.. ఎవ్వరినీ వదిలిపెట్టను అని హెచ్చరిం చినట్లు వార్తలు వచ్చేసాయి. అడ్డుకున్న పోలీసులనుద్దేశించి.. ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ అంటూ ఓ దశలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తోపాటు ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పోలీసులను నెట్టివేశారు. మరో నేత అంబటి రాంబాబు పోలీసులను కొడతానంటూ బెదిరించారు. అంతకు ముందు పోలీసుల వైఖరికి నిరసనగా జగన్ , వైసిపి నేతలు విమానాశ్రయం రన్ వేపై బైఠాయించి నిరసన తెలిపారు. మొత్తానికి ప్రత్యేకే హోదా ఉద్యమం కొత్త అంశాలు తెరలేపుతోంది. జగన్ కూడా ఈ ఉద్యమ విషయంలో ఇక ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తాడో పేడో తేల్చుకోవాలనే ధోరణి కనబరుస్తున్నట్టు పార్టీ శ్రేణులనుంచి వినిపించే మాట. చూద్దాం ఏమవుతుందో ...

ఇది కూడా చూడండి : బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

ఇది కూడా చూడండి : అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

English summary

Jagan shared his feelings