బాబు దారిలోనే జ‌గ‌న్ - అవినీతిపై  పుస్త‌కం

Jagan To Publish Book On Chandrababu Naidu

05:35 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Jagan To Publish Book On Chandrababu Naidu

రాజకీయాల్లో అధికార పక్షం తప్పులు ఎత్తిచూపడానికి ప్రతిపక్షం, అలాగే ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడానికి అధికార పక్షం ఎత్తుకు పై ఎత్తులు వేయడం తెల్సిందే. ఏదోరకంగా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి కూడా. తాజాగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అవినీతిపై వైసిపి అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి భారీ పోరాటానికి రెడీ అవుతున్నారు. జ‌గ‌న్ గ‌తంలో త‌న తండ్రిని ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు ఎలాంటి ట్రిక్కులు ఫాలో అయ్యాడో ఇప్పుడు అదే చంద్ర‌బాబును ఎదుర్కొనేందుకు జ‌గ‌న్ కూడా అదే బాట ఎంచుకున్నాడు. గతంలో వైఎస్ రాజశేఖ‌ర రెడ్డి ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవినీతిపై `రాజా ఆఫ్ కరప్షన్` పేరిట పుస్త‌కాన్ని టిడిపి విడుద‌ల చేసింది. వైఎస్ హ‌యాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల జాబితాను ఇందులో పొందుపరుస్తూ, ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం విడుద‌ల చేసిన ఈ పుస్త‌కం అప్పుడు సంచలనం అయింది.

ఇవి కూడా చదవండి: తన సినిమా చూసి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత

ఈ పుస్త‌కాన్ని చంద్ర‌బాబు అప్ప‌ట్లో జాతీయ‌స్థాయి నాయ‌కుల‌కు ఇచ్చి విస్తృత స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించారు. ప్ర‌స్తుతం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇఫ్పుడు అదే సీన్ రిపీట్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. రాజధాని అమరావతిలో చంద్రబాబు, ఇత‌ర మంత్రులు అడ్డ‌గోలుగా కొనుగోలు చేశార‌ని వైసీపీ ఆరోపిస్తోంది. త‌రువాత పట్టిసీమ- హెచ్ఎన్ఎస్ఎస్; జీఎన్ఎస్ఎస్, పోలవరం ప్రాజెక్టులో అంచనాల పెంపు, విద్యుత్ ప్రాజెక్టుల కుంభకోణాలు ఇలా అవినీతి, అక్రమాలకు పుస్తక రూపం ఇవ్వనున్నారట‌. బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక చేసిన జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌ను ఈ పుస్త‌కంలో పొందుప‌రిచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీతో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులకు అందజేయాలని జ‌గ‌న్ నిశ్చ‌యించుకున్నార‌ని అంటున్నారు. ఈ అవినీతి సొమ్ముతోనే చంద్ర‌బాబు త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ జ‌గ‌న్ దేశ‌వ్యాప్తంగా చేసే ఈ ప్రచారం జగన్ కి మైలేజ్ ఇస్తుందో , వికటిస్తుందో చూడాలి మరి .

ఇవి కూడా చదవండి:చెర్రితో సల్మాన్ సినిమా

ఇవి కూడా చదవండి:జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

English summary

Ysrcp Party leader Y.S.Jagan to release a book on the Corruption on Andhra Pradesh Chief Minister Nara Chandra Babau Naidu. He said that he was going to give that book to Narendra Modi and few other National Leaders.