నాగ్‌ సినిమాలో జగ్గూ విలనా?

Jagapathi Babu as a villan in Nagarjuna movie

12:10 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Jagapathi Babu as a villan in Nagarjuna movie

సినీ నటుడు జగపతిబాబు రీఎంట్రీ ఇచ్చిన సినిమా 'లెజెండ్‌'. ఈ సినిమాలో మొదటిసారి విలన్‌ పాత్రను పోషించాడు జగపతి. ఈ సినిమా ఘనవిజమం సాధించడంతో జగపతిబాబు సెకెండ్‌ ఇన్నింగ్స్‌ విజయవంతంగా మొదలైంది. ప్రస్తుతం వచ్చే సినిమాలలో విభిన్న పాత్రలలో నటిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా 'నాన్నకుప్రేమతో' లో విలన్‌ పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశాడు. అయితే తాజాగా మరో సినిమాకి జగపతిబాబు ఒప్పుకున్నట్లు సమాచారం. రవితేజ హీరోగా, దిల్‌రాజు నిర్మాతగా, వేణుశ్రీరాం దర్శకత్వం ఒక సినిమా రావాల్సి ఉంది.

అయితే రవితేజ తప్పుకోవడం వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దీంతో నాగార్జునని ఈ సినిమాలో హీరోగా ఫిక్స్‌ చెయ్యాలనే ఆలోచలనలో ఉన్నారు. ఈ సినిమాలో విలన్‌ పాత్రకోసం జగపతిబాబు తో చర్చలు జరుపుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే నాగ్‌ హీరోగా జగపతిబాబు విలన్‌గా 'ఎవడో ఒకడు' అనే టైటిల్‌ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

English summary

Jagapathi Babu as a villan in Nagarjuna 'Yevadu Okadu' movie. This is not at confirmed still it is in discussion stage. Venu Sriram want to direct this movie and Dil Raju want to produce it.