చిరు 150వ చిత్రంలో విలన్ అతనా?!

Jagapathi Babu is villain in Chiranjeevi 150th movie

11:31 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Jagapathi Babu is villain in Chiranjeevi 150th movie

దాదాపు 8 సంవత్సరాలు తరువాత మెగా స్టార్ చిరంజీవి హీరోగా మళ్లీ నటించబోతున్నారు.. ఇది చిరంజీవికి 150వ చిత్రం కావడం విశేషం.. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్ గా చిరు 150వ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రారంభామైపోయాయి.. దర్శకుడిగా వి.వి. వినాయక్, హీరోయిన్ గా హాట్ బ్యూటీ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ఫిక్స్ అయిపోయారు.. మరి విలన్ ఎవరు? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.. ఆ ప్రశ్నకు కూడా సమాధానం దొరికేసిందని చెప్తున్నారు..

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వెలిగి ప్రస్తుతం విలన్ గా మారి క్రేజీ విలన్ గా పేరు తెచ్చుకుని విలన్ గా కూడా సత్తా చాటుతున్న జగపతి బాబు, చిరంజీవి 150వ చిత్రంలో విలన్ గా నటించబోతున్నాడని సమాచారం.. ఇదే గనుక నిజమైతే చిరంజీవికి సరైన పోటీగా జగపతి బాబు సరిగ్గా సరిపోతాడని అందరి అభిప్రాయం..

English summary

Jagapathi Babu is villain in Chiranjeevi 150th movie. Family hero Jagapathi Babu is acting as a hero in Chiranjeevi 150th movie.