హాలీవుడ్ హీరో రేంజిలో జగ్గూభాయ్

Jagapathi Babu Nannaku Prematho stills

12:00 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Jagapathi Babu Nannaku Prematho stills

వయసు పెరిగేకొద్దీ మరింత డైనమిక్ కనిపిస్తూ, ఈ వయసులోనూ అసాధారణ విజయాలను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు టాలీవుడ్ జగ్గూభాయ్ జగపతి బాబు. తాజాగా నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను చూస్తుంటే జగపతి బాబా చాలా మోడ్రన్‌గా, డైనమిక్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాలో మహేష్‌బాబు తండ్రిగా, వేల కోట్లకు అధిపతిగా పవర్‌ఫుల్ నటను ప్రదర్శించి అందరిచేతా శభాష్ అనిపించుకున్న జగపతిబాబు, ఇప్పుడు నాన్నకు ప్రేమతో చిత్రంలోనూ అదే స్థాయి పాత్రను పోషిస్తున్నట్లు కనిపిస్తొంది. 

 

1/17 Pages

నాన్నకు ప్రేమతో సినిమాలో ముఖ్యంగా నెగిటివ్ రోల్‌లో నటిస్తున్న జగ్గూభాయ్ పాత్ర చాలా వినూత్నంగా ఉండబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. చాలా ప్రొఫెషనల్ లుక్‌తో బిగ్‌షాట్ లా కనిపించేందుకు జగపతి మేకప్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అధిక శాతం విదేశాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో జగ్గూభాయ్ ఒక పవర్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ క్యారక్టర్‌గా ఉండబోతుందట. 

English summary

Macho man Jagapathi Babu latest stills from Nannaku Prematho movie, Ntr and Rakul Preet Singh is sharing screen first time in this movie. Sukumar is directed this movie.