స్టైలిష్‌ లుక్‌ లో జగపతిబాబు

Jagapathi Babu New Stylish Look

09:56 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Jagapathi Babu New Stylish Look

జగపతిబాబు 90 లలో ఫ్యామిలీ సినిమాలలో బాగా నటించి ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులలో క్రేజ్‌ సంపాదించాడు. ఇటీవల కాలంలో వచ్చిన లెజెండ్‌ సినిమాలో విలన్‌గా నటించి తనలో ఉన్న యాక్టింగ్‌ ప్రతిభను నిరూపించుకున్నాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త సినిమాలో జగపతిబాబు స్టైలిష్‌ లుక్‌ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్‌ కానుంది. రిలీజ్‌ దగ్గర పడుతున్న ఈ సమయంలో సినిమాలో పాత్రలను రివీల్‌ చేస్తున్నాడు డైరెక్టర్‌ సుకుమార్‌. ఈ సినిమాలో జగపతిబాబు విలన్‌ గా స్టైలిష్‌ లుక్స్‌తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్స్‌లో ఉన్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్‌ కానుంది. స్టైలిష్‌ లుక్స్‌ ను హీరోకి మాత్రమే కాకుండా విలన్‌ కు కూడా డిజైన్‌ చేసి భారీహిట్‌ కొట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

English summary

Family hero jagapathi turned as villian by The balakrishna's legend movie.He Got Good marks as Villian.Here is the new stylish look of Jagapathi Babu