కమ్మ కులం గొప్పేంటి ?: జగపతిబాబు

Jagapathi Babu Shocking Comments On Caste

04:09 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Jagapathi Babu Shocking Comments On Caste

ఫ్యామిలీ హీరో గా సినీ పరిశ్రమకు వచ్చిన జగపతి బాబు తనదైన కుటుంభ కథా చిత్రాలతో మహిళా అభిమానులను సంపాదించుకున్నాడు . హీరో గా తన కెరీర్ నెమ్మదిస్తున్న సమయంలో విలన్ గా మారి అందరిని అలరిస్తున్న జగపతి బాబు తాజా గా కులాల పై షాకింగ్ కామెంట్స్ చేసాడు .

మత ప్రస్తావనలకు , కుల పట్టింపులకు ఎప్పుడు వీలైనంత దూరంగా ఉండే జగపతిబాబు కులాల , మతాల పై సంచలన వాఖ్యాలు చేసాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో జగపతిబాబు మాట్లాడుతూ .. తనకు కులం , మతం,ప్రాంత భేదాలు లేవని , అల ఉంటె "జై బోలో తెలంగాణా" వంటి చిత్రంలో నటించే వాడిని కాదని , కులాలు , మతాలూ లేనటువంటి సమాజాన్ని కోరుకుంటానని జగపతిబాబు అన్నాడు.

ఇవి కూడా చదవండి : వ్యభిచారిగా మారిన టీచర్

ఏదో ఒక కులాన్ని బీసీ లలో చేర్చాలని , మరో కులాన్ని ఎస్సీ లో చేర్చాలని చేసే డిమాండ్లు కేవలం రాజకీయపరమైనవని , తాను కమ్మ కులం పుట్టాను కాబట్టి ఈ మాట చెప్పడం లేదని . కమ్మ కులంలో పుట్టనంత మాత్రాన తన గోప్పేంటని , అందరిలాగానే కమ్మ వాళ్ళు కుడా పుట్టారని జగపతి బాబు అభిప్రాయపడ్డాడు.

ఇది కూడా చదవండి: వ్యభిచారిగా మారిన టీచర్

కుమార్తె పెళ్లి విషయం లో కుడా..

జగపతి బాబు కూతురు వివాహం ఒక విదేశీయుడు తో జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే . ఆ విషయం పై జగపతి బాబు మాట్లాడుతూ కమ్మ కులం లో వీరమాచనేని వంశాన్ని పెద్ద ఫ్యామిలీ గా భావిస్తారని , అలంటి తన కూతురిని ఒక అమెరికా యువకుడికి ఇచ్చి పెళ్లి చెయ్యడం పై పలువురు ప్రశించారని అని చెప్పాడు. అలా అడిగిన వాళ్ళందరికీ సమాధానంగా మా అమ్మాయి , ఆ అమ్మాయి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు , వాళ్ళిద్దరికీ ఇష్టమైనప్పుడు కులాల గురించి పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పినట్లు చెప్పాడు. కులాలు , మతాలూ గురించి మాట్లాడుకోవడం అనవసరమని , ఈ కాలంలో కుడా కులాల ప్రస్తావన అంతా ఒక ట్రాష్ అని జగపతిబాబు అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి :

వింత చట్టాలు

18వ ఏట నుంచి తల్లిని అవ్వాలనుకున్నా..

'సర్దార్ ' లో దాగున్న రహస్యాలు

English summary

Family Hero Who Become Villan Jagapathi Babu says that the discussion all about caste and religion was the waste of time.