తన తండ్రి గురించి నోరు జారిన జగపతి బాబు(వీడియో)

Jagapathi Babu takes about his father

01:10 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Jagapathi Babu takes about his father

ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగొందిన జగపతి బాబు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండ్ తో బ్రేక్ తెచ్చుకున్న జగపతి బాబు ఆ తరువాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో చిత్రాలతో టాప్ స్ధాయికి చేరారు. ప్రస్తుతం స్టార్ హోదాని అనుభవిస్తున్న జగపతి బాబు తాజాగా ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. అయితే జగపతి బాబు ఎప్పుడూ సరదాగా మాట్లాడుతారు. ఏ విషయం అయినా దాచుకోకుండా మొఖం మీద చెప్పేయడం అలవాటు. అయితే.. అది అన్ని వేళలా పనికిరాదు. ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదం లేపుతున్నాయి.

తన జీవితంలో సినిమాల్లో కాకుండా.. మరో కోణాన్ని వెల్లడిస్తూ హీరోయిన్ల గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. ఆ సమయంలో జగపతి బాబు.. తనది తన తండ్రి పోలిక అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది.. అయితే, ఒకప్పుడు టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్న తన తండ్రి జీవితాన్ని చూసి.. తాను కూడా ఓ 'ప్లే బాయ్' గా జీవితాన్ని ఆనందించానని అనడం కొంత కలకలం రేపింది. సదరు యాంకర్ కుడా ఈ వ్యాఖ్యలకు షాక్ తిన్నా.. ఆ తరువాత ఏమి చెప్పాలో తెలియక నవ్వుకుంది. జగపతిబాబు ఓపెన్ మైండెడ్ గా ఈ వ్యాఖ్యలు చేసినా.. చనిపోయిన తన తండ్రి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పర్సనల్ విషయాలు బయటికి చెప్పాల్సిన అవసరం ఏమిటని సినీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

English summary

Jagapathi Babu takes about his father. Hero Jagapathi Babu takes about his father in a latest interview.