తండ్రి వారసత్వం కొనసాగింపుగా ....

Jagapathi Babu To Become Producer

12:01 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Jagapathi Babu To Become Producer

హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో రాణించి, ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం ఏర్పాటుచేసుకుని, ఇక హీరో అవకాశాల కోసం ఎదురుచూడకుండా , అందివచ్చిన చాన్స్ అందిపుచ్చుకుని, విలన్ గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టాక జగపతిబాబు కెరీర్‌ మరో రేంజ్ కి చేరిపోయింది. జగపతి బాబు ఏంటి, విలన్ గా వేయడమేంటి అనుకున్న వాళ్లకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చాడు జగపతి బాబు. ఫలితంగా మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, బాలకృష్ణ ఇలా పలువురు అగ్ర కథానాయకులతో దీటుగా నటించే చాన్స్ కొట్టేసారు. ఎప్పుడైతే విలన్ గా మంచి రేంజ్ వచ్చిందో, అందుకు అనుగుణంగా రెమ్యునరేషన్ కూడా భారీగానే ముడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక హీరోయిజం వైపుకి మనసు మళ్లే చాన్స్ లేనట్టే. అయితే, నిర్మాతగా మాత్రం ఓ ప్రయత్నం చేద్దామని అనుకుంటునట్టు బోగట్టా.

జగపతి బ్యానర్‌ పై ఇది వరకు ఎన్నో మంచి చిత్రాలొచ్చాయి. జగపతి బాబు తండ్రి విబి రాజేంద్రప్రసాద్‌ చిత్రసీమలో నిర్మాతగా ఆణిముత్యాల్లాంటి చిత్రాలందించారు. దసరా బుల్లోడు నుంచి విబి దర్శకుడుగా కూడా రాణించారు. జగపతి బాబు ఎంట్రీ కూడా ఈ బానర్ మీదే జరిగింది. గత కొన్నేళ్లుగా జగపతి బ్యానర్‌ నుంచి సినిమాలే లేవు. అయితే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చోవడం ద్వారా, ఓ పెద్ద విజయంతో జగపతి బ్యానర్‌ కార్యకలాపాల్ని మళ్లీ ఘనంగా పునః ప్రారంభించాలని జగపతిబాబు కసరత్తు చేస్తున్నట్టు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. కాకపొతే జగపతి బ్యానర్‌ లో తీసే సినిమాలో జగపతిబాబే నటిస్తారా, మరో కథానాయకుడి కోసం జగపతి బ్యానర్‌ ని సిద్ధం చేస్తారా అనేది తేలాలి. తండ్రి వారసత్వం కొనసాగిస్తే , నిర్మాత గా బాగా క్లిక్ అయ్యాక, భవిషత్తులో డైరెక్షన్ వైపు కూడా దృష్టి పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.

English summary

A news came to know that Family Hero who turned as villain from legend Movie Jagapathi babu was going to become a producer. Previosly his father was also produced many films in his banner and now jagapathi babu was also showing intrest in film production .