స్పీల్బర్గ్ సినిమాకు పనిచేయనున్న జగపతిబాబు

Jagapathi Babu To Give His Voice For The BFG Movie

11:05 AM ON 30th May, 2016 By Mirchi Vilas

Jagapathi Babu To Give His Voice For The BFG Movie

ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకుని, కుటుంబ కథా చిత్రాలకు మారు పేరుగా పేరు పొందాడు జగపతి బాబు. ఇటీవల తన స్టైల్ మార్చుకుని విలన్ గా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. విలన్ గా, హీరోకు తండ్రిగా నటిస్తూ ఫుల్ స్వింగ్ మీదున్న జగపతి బాబు తన కెరీర్ లో మరో మలుపు తీసుకోవడానికి సిద్దం అవుతున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే జగపతి బాబు ఒక హాలీవుడ్ సినిమాకు డబ్బింగ్ చెప్పబోతున్నాడు.

హాలీవుడ్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వంచరస్ ఫాంటసీ ఫిలిం 'ద బిఎఫ్జి' సినిమాకు తెలుగు, తమిళ వర్షన్లకు డబ్బింగ్ చెప్తున్నాడు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక 24 అడుగుల ఎత్తు ఉండే ఒక భారీ మనిషితో స్నేహం చేసే ఒక పదేళ్ల చిన్నారి కథ 'ద బిఎఫ్జి'. సరికొత్త ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను రోనాల్డ్ డాల్హ్ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నఈ సినిమాను ఈ సంవత్సరం జూలై 1న ప్రపంచవ్యాప్తంగా భారి ఎత్తున విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రంలో లీడ్ రోల్ అయిన ఆ 24 అడుగుల భారీ మనిషికి జగపతిబాబు తన స్వరాన్ని అందిస్తుండడంతో దక్షిణాదిలో కూడా ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడుతోంది.

ఇవి కూడా చదవండి: ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

ఇవి కూడా చదవండి:చిన్నారి పట్ల క్రూరంగా ప్రవర్తించిన గొరిల్లా హతం

English summary

Family Hero Who Turned Villan Jagapathi Babu was now going to become a dubbing artist. Jagapathi Babu was going to give his voice for the movie Named "The BFG" which was directed by Steven Spielberg's movie.