సినీ అవకాశాలకోసం జగపతిబాబు పోర్టల్‌

Jagapathi Babu To Launch Movie Portal

11:48 AM ON 5th April, 2016 By Mirchi Vilas

Jagapathi Babu To Launch Movie Portal

ఒకే నటుడు ... విభిన్న రూపాలు ... పైగా జీవితంలో ఎత్తు పల్లాల్ని చూసిన నటుడు... ఇంకెవరు జగపతిబాబు.... కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన జగపతి లేడీస్ ఫాలోయింగ్ వున్న నటుడిగా గుర్తింపు పొందాడు. మధ్యలో ఒడుదొడుకుల్ని చవిచూసి ఇప్పుడు విలన్ గా మారి మళ్లీ లేచి నిలబడ్డాడు. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం... ఇలా నాలుగు భాషల్లో నటిస్తూ, బిజీగా ఆర్టిస్టుగా కొనసాగుతున్న జగపతి ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో పలు విషయాలు చెప్పాడు. సొంతంగా వాళ్ళ నాన్న జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఎన్నో చిత్రాలు తీసారు. ఇప్పుడు ఆ బ్యానర్ మీదా ఏమైనా సొంత చిత్రాలు తీసే ఉద్దేశ్యం గురించి అడిగిన ప్రశ్నకు జగపతి బాబు స్పందిస్తూ, 'వ్యాపారం చేయడం నాకు తెలియదు. అందుకే నిర్మాణం జోలికి వెళ్లే ఆలోచన లేదు' అనే చెప్పేసాడు. అయితే సినిమాకి సంబంధించి కొత్తగా ఓ ప్రయత్నం మాత్రం చేయాలనైతే నిర్ణయం తీసుకొన్నానని చెబుతున్నాడు. " క్లిక్‌ సినీ కార్ట్‌ పేరుతో ఓ పోర్టల్‌ని మొదలు పెట్టబోతున్నా. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఒక వేదికగా ఇది ఉపయోగపడుతుంది. ప్రతిభావంతుల్ని గుర్తించి వాళ్ల వివరాల్ని మా పోర్టల్‌లో పెడతాం. వాళ్ల వివరాల్ని నిర్మాణ సంస్థలకి పరిచయం చేయడం, అవకాశాలు కల్పించడంలాంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఇది ఉచిత సేవ కాదు. ఈ సంస్థని ఉగాది రోజున దాసరి నారాయణరావుగారి చేతుల మీదుగా ప్రారంభిస్తాం" అని వివరించాడు.

ఇవి కుడా చదవండి:

తన లవ్ స్టోరీ గుట్టు విప్పిన అనసూయ

సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

విడుదలకు ముందే బాహుబలి రికార్డు బ్రేక్

'సర్దార్‌' ఇంటర్వెల్‌ డైలాగ్‌ లీక్‌

English summary

Family Hero Jagapathi babu who turned Villan was said that he was going to start a new movie portal to give chances new talented actors.This portal was going to be start by Dasari Narayana Rao on the occasion of Ugadi Festival.