నన్ను క్షమించండి: జగపతిబాబు

Jagapathi babu walked out of life again

06:05 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Jagapathi babu walked out of life again

ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన గౌతమి క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేసి గెలిచింది. తన మాదిరిగానే ఎందరో క్యాన్సర్‌ వ్యాధితో పోరాడం చేస్తున్నారని, ఏటా చాలా మంది చనిపోతున్నారని వారిలో కొందరినైనా కాపాడాలనే ఉద్దేశ్యం తో ఆమె 'లైఫ్‌ ఎగైన్‌' పేరిట ఓ ఆర్గనైజేషన్‌ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. అందులో భాగస్వామిగా జగపతిబాబు ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఆ స్వచ్ఛంద సంస్థ నుండి వైదొలిగినట్లు తెలిపారు. ఈ సందర్బంగా జగపతిబాబు క్షమాపణలు కోరుతూ ఫేస్‌బుక్‌ లో ఓ వీడియోని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్‌బుక్‌ లో చక్కర్లు కొడుతుంది. కాకపోతే ఆయన ఎందుకు బయటకు వచ్చారనే విషయం మాత్రం చెప్పలేదు.

గౌతమి క్యాన్సర్‌ తో పోరాడి విజయం సాధించి, ఆమెలాగే ఆవ్యాధి నుండి బయటపడి సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆమె ఎన్నో చైతన్యం కల్గించే కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఒకరికి ఒకరం, అందరికోసం మనం అన్న అర్ధం వచ్చేలా ''వన్ ఫర్‌ వన్, వి ఆర్‌ దేర్‌ ఫర్‌ ఎవ్రీ వన్’' అని నినాదం తో సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే కమల్‌ హాసన్‌ షికాగోలో లైఫ్‌ఎగైన్‌ తరుపున ప్రపంచస్థాయి అవగాహన శిబిరాన్ని ప్రారభించాడు. దీనిలో మమతామోహన్‌ దాస్‌, హైమారెడ్డి, ఉత్తరప్రదేశ్‌ ఎంపీ గాయత్రి ప్రసాద్‌, జగపతిబాబు మొదలగువారు హాజరయ్యారు.

Hello everybody, I regret to inform with that I am not a part of LIFE AGAIN organisation anymore... Please understand

Posted by Jaggu Bhai on Tuesday, March 1, 2016

English summary

Jagapathi took Facebook to convey the message through a video, in which he apologized all and regrets to say that he is not a part of Life again organisation anymore...