అమ్మాయిలిద్దరూ యోగాకు వెళ్లారు.... ఆతర్వాత ఎలా మారారు

Jaggi Vasudevs yoga center holding two girls

12:16 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Jaggi Vasudevs yoga center holding two girls

ఇప్పుడు ఎక్కడ చూసినా యోగా గురించే చర్చ... పైగా ప్రపంచ యోగా డే కూడా నిర్వహిస్తున్నారంటే అది మన ఘనతే. అయితే యోగా క్లాసుల నెపంతో ఆధ్యాత్మికవేత్త, యోగా గురు కూడా అయిన జగ్గీ వాసుదేవ్ కు చెందిన యోగా సెంటర్లో ఇద్దరు యువతులు బందీలుగా ఉన్నారట. ఈ విధంగా వచ్చిన వార్త కోయంబత్తూరులోని ఈషాలో సంచలనం రేపుతోంది. యోగా సెంటర్ లో తన ఇద్దరు కూతుళ్ళను బందీలుగా చేశారని, వాళ్ళను విడిపించాలని కామరాజ్ అనే రిటైర్డ్ ప్రొఫెసర్ ఇప్పుడు జిల్లా కలెక్టర్ ను కలిసి కోరడమే ఇందుకు కారణం. తన కూతుళ్ళు గీతా కామరాజ్(33), లతా కామరాజ్(31) ఈ మధ్య యోగా నేర్చుకునేందుకు ఈ యోగా సెంటర్ కు వెళ్ళారని, అయితే అక్కడ వారికి బ్రెయిన్ వాష్ చేసి బలవంతంగా సన్యాసినులుగా మార్చినట్టు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

తన కూతుళ్ళిద్దరికీ, శిరో ముండనం చేసి.. కాషాయ వస్త్రాలు ధరింపజేశారని ప్రొఫెసర్ అన్నారు. జగ్గీ వాసుదేవ్ అయితే తమ పిల్లలను బలవంతంగా వివాహం చేసుకోవడానికి యత్నిస్తున్నారని కూడా ఆయన ఆరోపించాడు. వారి గతి ఇలా అవుతుందని అనుకోలేదని కామరాజ్ దంపతులు వాపోతున్నారు. సెంటర్ నిర్వాహకులను ఈ విషయమై సంప్రదించినా, తమను సెంటర్ లోకి అనుమతించడంలేదని వీరు వాపోతున్నారు. తమ కుమార్తెల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రొఫెసర్ దంపతులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

English summary

Jaggi Vasudevs yoga center holding two girls