చిరంజీవి వెళ్ళేది కొలకత్తా జైలుకి కాదట!

Jail set in Ramoji Film City for Kathilantodu movie

11:28 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Jail set in Ramoji Film City for Kathilantodu movie

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం కత్తిలాంటోడు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని వి.వి. వినాయక్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 20వ తేదీ నుండి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది. ఇందులో చిరంజీవి సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించనుంది. అయితే ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ లో హీరో విజయ్ జైలు నుండి తప్పించుకుంటాడు. ఈ సన్నివేశాన్ని కొలకత్తా జైలులో చిత్రీకరించారు.

అయితే ఇప్పుడు దీని రీమేక్ లో చిరంజీవి కొలకత్తా జైలుకి వెళ్ళడట. ఈ జైలు సెట్ ని రామోజీ ఫిలిం సిటీలో, ఆర్ట్ డైరెక్టర్ తోట ధరణి నేతృత్వంలో వెయ్యబోతున్నారట. మొత్తం మీద ఈ చిత్రం శ్రీకారం చుట్టుకుంది.

English summary

Jail set in Ramoji Film City for Kathilantodu movie