చిందేసినందుకు ... హూస్టింగ్...

Jailer Suspended For Dancing

09:52 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Jailer Suspended For Dancing

అదేమిటి అనుకుంటున్నారా ? అవును మరి డ్యూటీ డ్రెస్ లో ఉండి , రెచ్చిపోయి డాన్స్ చేస్తే, హూస్టింగ్ అవ్వకపోతే, ప్రమోషన్ వస్తుందా? పైగా జైలర్ కూడానూ .... తమిళనాడు లోని సేలం జిల్లా అత్తూరులో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి , వివరాల్లోకి వెళితే, ఆనందంగా డాన్స్ చేసి, తోటి ఉద్యోగులను అలరింపజేసిన ఆ జైలర్ చివరకు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యాడు. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఈ డాన్స్ దృశ్యాన్ని కొంతమంది వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేసారు. దీంతో ఇది చూసిన ఉన్నతాధికారులు సదరు జైలర్ పై సస్పెన్షన్ వేటు వేసేసారు.

తమిళనాడు లోని సేలం జిల్లా అత్తూరు డిప్యూటి జైలర్ శంకరన్ జనవరి 26న రిపబ్లిక్ పెరేడ్ లో పాల్గొనకుండా సహోద్యోగి రూం లో యూనిఫారం తో చిందేసాడు. అయితే తోటి అధికారులు వారించాల్సిందిపోయి ప్రోత్సహించారు. తమ తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేసారు. వాట్స్ యాప్ లో షేర్ చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ, మరింత మందిని అలరిస్తున్న ఈ విడియో ఉన్నతాధికారుల కంట పడింది. దీంతో శంకరన్ ని సేలం సెంట్రల్ జైలుకి బదిలీ చేసి, విచారణకు ఆదేశించారు. కోయంబత్తూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ షణ్ముగ సుందరం విచారణ జరిపి, చర్యలు తీసుకున్నారు. మొత్తానికి తోటి ఉద్యోగులను , సోషల్ మీడియాలో పలువురిని అలరించిన ఈ విడియో అతని పాలిట శాపమైంది.

English summary