త్రిషను కూడా చంపేసిన సోషల్ మీడియా!

Jallikattu supporters fake poster on Trisha

11:37 AM ON 17th January, 2017 By Mirchi Vilas

Jallikattu supporters fake poster on Trisha

బతికున్నవాళ్లను చెంపేయడం సోషల్ మీడియాకు కొత్తేమి కాదు ఎందుకంటే గతంలో వేణు మాధవ్ వంటి వాళ్ళను ఇలానే చేసింది. ఆతర్వాత నాలుక్కరుచుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఇప్పుడు నటి త్రిష వంతయ్యింది. . తమకు నచ్చిన పని అందరికి నచ్చాలని లేదు. తాము చేస్తున్న డిమాండ్లపై పాజిటివ్ గా రియాక్ట్ కాకుండా.. తప్పు పట్టిందన్నకారణంగా తమిళులు కొందరు ప్రదర్శించిన ఆగ్రహం ఇప్పుడు అందరి చేత ఛీ కొట్టేలా చేస్తోంది. సంక్రాంతి పండగ రోజున తమిళనాడులో ఘనంగా నిర్వహించే జల్లికట్టును నటి త్రిష వ్యతిరేకిం చింది. జంతు సంరక్షక సంస్థ అయిన పెటాలో సభ్యురాలైన ఆమె.. జల్లికట్టు పేరిట మూగజీవాల్ని హింసించటం సరికాదన్నది ఆమె వాదన. దీనిపై తమిళులు తీరును ఆమె తప్పు పట్టింది. జల్లికట్టును నిలిపివేయాలని ఆమె కోరారు. దీనిపై తమిళులు తీవ్ర ఆగ్రహానికి గురికావటమేకాదు.. ఆమె నటిస్తున్నచిత్ర షూటింగ్ ను అడ్డుకున్నారు. దీంతో..తాను చేసిన వ్యాఖ్యలపై రచ్చ పెరుగుతున్న నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గి.. సారీ కూడా చెప్పేసింది.

ఇక జల్లికట్టును వ్యతిరేకించిన త్రిష మీద తమ అక్కసును తీర్చుకునేందుకు సోషల్ మీడియాలో వికృత చేష్టలకు పాల్పడ్డారు. పెటా ప్రచారకర్త.. నటి త్రిష ఇక లేరంటూ ఆమె మరణించినట్లుగా ఒక పోస్టర్ ను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆమె జననం 04-05-1983గా పేర్కొన్న వారు.. ఆమె 12-01-2017లో మరణించినట్లుగా పోస్ట్ చేశారు.

ఈ విషయాన్ని తన ట్వీట్ తో త్రిష స్వయంగా వెల్లడించటం గమనార్హం. సోషల్ మీడియాలో తనను చంపేసిన వైనాన్ని.. దానికి సంబంధించిన ఫోటోను చూసి షాక్ తిన్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జల్లికట్టును వ్యతిరేకించిన నేపథ్యంలో కొందరు తనపై పెడుతున్న అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఆమె తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో ఎంత సులువుగా పోస్టులు పెట్టే వీలుంటే మాత్రం.. ఇలా ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టేస్తారా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. తక్కువ కాలంలోనే సోషల్ మీడియా ఇంతలా భ్రష్టు పట్టడం పట్ల పలువురు ఆవేదన చెందుతున్నారు.

ఇది కూడా చూడండి: చర్మాన్ని మృదువుగా మార్చుకోవాలంటే ఈ టిప్స్ పాటించాలి!

ఇది కూడా చూడండి: బాడీ బిల్డర్లకు దిమ్మతిరిగే వార్త!

English summary

Actress Trisha Died the fake news is spreading all over the Social media