స్పెక్టర్‌ ఐటమ్స్ ఆక్షన్

James Bond Spectre auction to Sell Online

11:27 AM ON 17th February, 2016 By Mirchi Vilas

James Bond Spectre auction to Sell Online

బాండ్.. జేమ్స్‌ బాండ్‌.. ఈ డైలాగ్ చెప్పగానే.. స్పై సినిమాలు మన కళ్ల ముందు మెదులుతాయి కదా. బ్రిటీష్ గూఢచార ఏజెంట్ అయిన 007 పెరిట రూపొందే ఈ చిత్రాలకు ప్రపంచ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బాండ్ సిరీస్ లో వచ్చిన చివరి చిత్రం స్పెక్టర్‌. గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన 24 వస్తువులను లండన్‌లోని క్రిస్టీస్‌ ఆక్షన్‌ హౌస్‌లో వేలానికి ఉంచారు. క్లాప్‌ బోర్డు, జేమ్స్‌ బాండ్‌ క్యారెక్టర్‌ డానియెల్‌ ధరించిన మాస్కు, ఉంగరం, చేతి గడియారంతో పాటు మొత్తం 24 వస్తువులను వేలానికి వేయనున్నారు. ఈ వస్తువులను ఆన్‌లైన్‌లో కూడా వేలానికి పెడుతున్నారు. లండన్‌లోని కింగ్‌ స్ట్రీట్‌లో వీటిని వేలం వేస్తారు. స్పెక్టర్‌ చిత్రంలో నటించిన నటుల నుంచి ఈ వస్తువులను సేకరించారు.

English summary

The Aston Martin DB10, Bond's car of choice in Spectre - which was specially created for the movie and some other thing which was used in the movie were sell in auction by the movie team of James bond Spectre movie