కాశ్మీర్ సిఎమ్ సయీద్ ఇకలేరు

Jammu Kashmir CM Passes Away

09:52 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Jammu Kashmir CM Passes Away

జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌(79) కన్నుమూశారు. పీడీపీ, భాజపా కూటమితో ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ 2015 మార్చి 1న జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సయీద్ మెడనొప్పి జ్వరంతో బాధపడుతున్న డిసెంబర్‌ 24న దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గత 10 రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఆరోగ్యం పూర్తిగా విషమించి గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గతంలో కేంద్ర హొమ్ మంత్రి గా పనిచేసిన సయీద్ కాశ్మీర్ సిఎమ్ గా, పలు కార్యక్రమాలు చేపట్టారు. సయీద్ మరణం పట్ల ప్రధాని మోడీ , పలు రాష్ట్రాల సిఎమ్ లు , పలువురు నాయకులు తీవ్ర సంతాపం తెల్పారు.

English summary

Jammu Kashmir Cheif Minister Mufti Mohammad Sayeed passes away today.Due to lungs infection he joined in hospital on December 24.