బిగ్ బి కే  ఇబ్బంది అయ్యేదన్న రణవీర్

Jammu Kashmir Ex-Cheif Minister Dance With Ranveer Singh

12:39 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Jammu Kashmir Ex-Cheif Minister Dance With Ranveer Singh

మీరు కనుక సినిమాల్లోకి వస్తే, బిగ్ బి అమితాబ్ కే ఇబ్బందయ్యేది అంటూ రాజకీయ నిష్ణాతుడైన ఓ మాజీ సిఎమ్ తో బాలీవుడ్‌ యువ కథానాయకుడు రణవీర్ అన్నాడట. ఇంతకీ ఆ రాజకీయ వేత్త ఎవరంటే జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా. ఇంతకీ ఈ మాట ఎందుకు అన్నట్టు? వివరాలలోకి వెళితే, ఎన్డీటీవీ మంగళవారం రాత్రి నిర్వహించిన ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుల కార్యక్రమానికి ఫరూక్‌ అబ్దుల్లా చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

రణ్‌వీర్‌సింగ్‌కి ‘ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ ప్రకటించడంతో, ఈ అవార్డును రణ్‌వీర్‌కి ఫరూక్‌ అబ్దుల్లా ప్రదానం చేయాల్సిందిగా యాంకర్ పిలిచాడు. వేదిక మీదికి అవార్డు ప్రదానం చేయడానికి వచ్చిన ఫరూక్‌, కుర్రాడిగా మారిపోయారు. సరదాగా రణ్‌వీర్‌తో కలిసి ‘బాజీరావ్‌ మస్తానీ’ చిత్రంలోని ఓ పాటకు చెందేసారు. ఒకరు రాజకీయాల్లో ఆరితేరిన వారైతే , మరొకరు బాలీవుడ్‌ యువ కథానాయకుడు... ఇక వీరిద్దరూ కల్సి చిందేస్తే, ఆ కిక్కే వేరు కదా. దీంతో సభా ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

అంతటితో ఊరుకున్నారా అంటే అదీ లేదు. 'మీరు నటుడు అయ్యుంటే.. అమితాబచ్చన్‌కి ఇబ్బందిగా ఉండేది' అంటూ ఫరూక్‌ని ఉద్దేశించి రణ్‌వీర్‌ అనేసాడట. దీంతో ‘తనకు నటన అంటే ఇష్టమని.. ఈ జన్మలో కుదరలేదని.. వచ్చే జన్మలో ప్రయత్నిస్తా’ అంటూ ఫరూక్‌ స్పందించడం కొసమెరుపు.

English summary

Jammu and Kashmir Ex-Cheif Ministeer Farooq Abdullah danced with bollywood hero Ranveer Singh in an " Indian Of The Year " award event which was conducted by NDTV