నెలకు రూ 15 లక్షలు భరణం కోరుతున్న ఒమర్ వైఫ్

Jammu Kashmir Ex CM Omar Abdullah Wife Payal seeks Rs 15 lakh a month

11:02 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Jammu Kashmir Ex CM Omar Abdullah Wife Payal seeks Rs 15 lakh a month

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భార్య పాయల్ అబ్దుల్లా నెలకు రూ.15లక్షల భరణం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆమె కోర్టుకు వెళ్లారు. ఇటీవల డిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు డిల్లీలోని జమ్ముకశ్మీర్ అధికారిక భవనం అక్బర్ రోడ్ లోని లుట్యెన్స్ నుంచి పాయల్ ను అధికారులు ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే. డిల్లీలో భవనం ఖాళీ చేసిన తర్వాత తాను, తన ఇద్దరు కుమారులు ఇల్లు లేక, డబ్బు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, ఒమర్ తమకు నెల నెలా డబ్బు చెల్లించాలని పాయల్ డిమాండ్ చేస్తున్నారు. తనకు, తన ఇద్దరు కుమారులకు మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.10లక్షలు ఇవ్వాలని, నివాసం కోసం రూ.5లక్షలు ఇవ్వాలని పాయల్ అడుగుతున్నారు. నివాసం లేకపోవడం వల్ల తన స్నేహితుల ఇళ్లలో ఉండాల్సి వస్తోందని పిటిషన్ లో వెల్లడించారు. పాయల్ పిటిషన్ ను విచారించిన ఫ్యామిలీ కోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని ఒమర్ అబ్దుల్లాకు నోటీసులు పంపినట్లు పాయల్ తరఫు న్యాయవాది వెల్లడించారు. తదుపరి విచారణను అక్టోబరు 27కు వాయిదా వేసినట్లు చెప్పారు. భార్యతో విడాకులు కావాలని ఒమర్ దాఖలు చేసిన పిటిషన్ ను ఆగస్టు 30న ట్రయల్ కోర్టు కొట్టేస్తూ, పాయల్ తనను వేధించిందనడానికి ఒమర్ సరైన కారణాలు చూపలేకపోయారని అప్పుడు కోర్టు తెలిపింది. అయితే పాయల్ మాత్రం తాను విడాకులు కోరుకోవట్లేదని చెప్పారు. ఒమర్ , పాయల్ కు 1994లో వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు 2013 నుంచి విడివిడిగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి:ఇరు రాష్ట్రాల్లో 'కావేరీ' రివర్ వార్ (వీడియో)

ఇవి కూడా చదవండి:ఫేస్ బుక్ లో అసభ్య ఫోటో పోస్ట్ చేసాడని .. యువతి సూసైడ్

English summary

Jammu And Kashmir State Ex- Chief Minister Omar Abdullah's wife Payal Abdullah was seeking 15 lakh rupees from his husband per month. She says that there was no home or no money to feed her Two children and she said that she seeks 10 lakh for her children and 5 lakhs for home.