ఆ లేడీ ఎంపీ డ్రైనేజీలో పడింది

Jamnagar MP Poonamben Maadam falls into drain

04:50 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Jamnagar MP Poonamben Maadam falls into drain

సాధారాణంగా డ్రైనేజ్ లలో మామూలు పౌరులు పడిపోతుంటారు. కానీ ఈసారి ఏకంగా ఓ లేడీ ఎంపీ పడిపోయింది. గుజరాత్ లో జామ్ నగర్ బిజేపి ఎంపీ పూనమ్ బెన్ మాదమ్ కి సోమవారం ఈ చేదు అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గంలో అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతుండగా, పరిశీలించడానికి ఆమె వెళ్ళారు. ఓ మురికివాడను సందర్శించిన ఆమె.. ఒక డ్రైనేజీ పై వేసిన స్లాబ్ మీద నిలబడి మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. దీంతో సుమారు పది అడుగుల లోతున్న డ్రైనేజీలో పడిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను బయటకు తీశారు.

పోలీసులు ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో గాయపడిన మరో ఇద్దరు మహిళలు కూడా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తమ ప్రాంతంలో కూల్చివేతలను ఆపాలని స్థానికులు కోరడంతో పూనమ్ అక్కడికి వెళ్ళారు. మొత్తానికి ఆ ఎంపీకి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

English summary

Jamnagar MP Poonamben Maadam falls into drain. Poonamben Maadam Jamnagar MP falls into drain.