పవన్ తడబడ్డాడా - స్క్రిప్ట్ తేడాయా ?

Jana Sena Leader Pawan Kalyan Speech At Kakinada

11:39 AM ON 10th September, 2016 By Mirchi Vilas

Jana Sena Leader Pawan Kalyan Speech At Kakinada

సినిమా వేరు ... రాజకీయం వేరు .. సినిమాల్లో ఎన్ని టేకులైనా తీసుకోవచ్చు కానీ రాజకీయ సభలైతే ఒకే టేకులో ఒకే చేయాలి. తప్పు దొర్లిందా ఇక తలంటేస్తారు. సరిగ్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ సభ లో ఇదే తేడా జరిగింది. సభ ప్రారంభంలో తప్పులో కాలేశాడు. 'ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అంటూ దేశభక్తి గీతాన్ని పవన్ ప్రస్తావిస్తూ, కరతాళ ధ్వనులు అందుకున్నాడు. అయితే దీన్ని రాసింది మహాకవి గురజాడ అని పవర్ స్టార్ చెప్పడం , ఇది లైవ్ లో చూసిన వాళ్ళు ఏమిటి ఇలా చెప్పాడు. తడబడ్డాడా లేక స్క్రిప్ట్ లో తేడానా అని చాలామంది వ్యాఖ్యానించుకున్నారు. సోషల్ మీడియాలో అయితే వెంటనే పోస్ట్ లు పెట్టి, తప్పును గుర్తుచేశారు. వాస్తవానికి దీన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ ఎలుగెత్తారు. అయితే కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయ్యారు. రాయప్రోలు బదులుగా గురజాడ పేరు చెప్పాడు. స్క్రిప్ట్ చూసి చదవడంతో తప్పు రాశారా , తప్పు చదివాడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంత పెద్ద సభలో చిన్న తప్పుని ఇష్యు చేయడం కాకుండా అసలు విషయం, పవన్ ఆవేదన చూడాలని పలువురు అభిమానులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: ఆఫీసుల్లో పాలిటిక్స్ కి చెక్ పెడతారా? అయితే చాణక్యసూత్రాలు తెలుసుకోండి

ఇది కూడా చూడండి: పెళ్లికి ముందే అమ్మాయి మనస్థత్వం తెలుసుకోండిలా..

English summary

Jana Sena Leader Pawan Kalyan Speech At Kakinada