ఉత్తరాంధ్రలో తండ్రీ కొడుకులు 

JanaChaitanya Yatra In North Andhra

01:15 PM ON 7th December, 2015 By Mirchi Vilas

JanaChaitanya Yatra In North Andhra

టిడిపి జన చైతన్య యాత్రలు ఎపిలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఏదో ఒక జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు ,ఆయన కుమారుడు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు నారా లోకేష్ , మంత్రులు హాజరబుతున్నారు. సోమవారం తండ్రీ కొడుకులిద్దరూ ఉత్తరాంధ్ర లో అది కూడా పక్క పక్క జిల్లాల్లోనే జన చైతన్య యాత్రల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సిఎమ్ చంద్రబాబు వజ్నపు కొత్తూరులో పాదయాత్ర సాగిస్తుంటే , విశాఖ జిల్లా మాడుగుల లో లోకేష్ దూసుకుపోతున్నాడు. సిఎమ్ కి పార్టీ నేతలు , అధికార , అనధికారులు స్వాగతం పలికితే , లోకేష్ కి పార్టీ నేతలతో పాటూ విద్యార్ధి విభాగం టి ఎన్ ఎస్ ఎఫ్ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. భవిష్యత్ నేతగా లోకేష్ ని ఫోకస్ చేయడాన్కి జనచైతన్యం కూడా ఒక వేదిక అవుతోంది.

English summary

Andhra pradesh cheif minister nara chandra babu naidu and his son nara lokesh were tour of jana chaitanya yatra in north andhrapradesh region