ఇక రోజూ పవన్ దంచుడే దంచుడు

Janasena Party Leader Pawan Targets BJP

11:14 AM ON 16th December, 2016 By Mirchi Vilas

Janasena Party Leader Pawan Targets BJP

ప్రశ్నించడానికే వచ్చానంటూ జనసేన ఆవిర్భావ సమయంలో ప్రకటించిన ఆపార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రోజూ ప్రశ్నల పరంపర సాగిస్తాడట. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభల్లో బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ అంశంపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఫ్ ను ఎందుకు నిషేధించలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గోవధ, రోహిత్ వేముల, దేశభక్తి, నోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై ప్రశ్నించనున్నట్లు పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. ఇకపై రోజుకో అంశంపై స్పందిస్తానని పవన్ చెప్పుకొచ్చాడు. శుక్రవారం రోజున రోహిత్ వేముల అంశంపై స్పందిస్తానని ట్విట్టర్ లో జనసేన అధినేత పవన్ ప్రకటించాడు. దీంతో పవన్ అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఆ పని చేయట్లేదన్న విమర్శలకు ఈవిధంగా చెక్ పెట్టినట్లయిందని, ఇప్పుడు పవన్ అసలు రూట్ లోకి వచ్చాడని పరిశీలకులు అంటున్నారు. మరి ప్రశ్నించే విధానం దానికి రియాక్షన్ ఎలా వుంటాయో చూద్దాం.

English summary

Janasena Party Leader Pawan Targets BJP