ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ రెడీ

Janata Garage First Look On NTR Birthday

01:01 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Janata Garage First Look On NTR Birthday

సాధారణంగా పుట్టిన రోజునాడు ఎవరైనా కానుకలు అందుకుంటారు. అయితే మన హీరోలు మాత్రం కాస్త భిన్నంగా కానుకలు ఇస్తుంటారు. అదేనండీ పోస్టర్, టీజర్ రూపేణా ఇస్తుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడట. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించిన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న, మైత్రి మూవీస్ సంస్థలో తెరకెక్కుతోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో సమంత, నిత్యమీనన్ నాయికలుగా నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనపడనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. కాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా ... బర్త్ డే గిఫ్ట్ రెడీ అయినట్టే. ఇక ఈ గిఫ్ట్ అందుకునేందుకు మాత్రం ఓ నెల రోజుల పాటు అభిమానులు నిరీక్షించాలి మరి ..

ఇవి కూడా చదవండి:

ఇంటి పై గుడినీడ పడకూడదా ?

మనం చనిపోతే ఫేస్‌బుక్‌ అకౌంట్ ఏమౌతుంది?

రేపిస్ట్ పురుషాంగాన్ని కోసేసిన మహిళ

English summary

Young Tiger NTR was presently acting in Janata Garage movie under the direction of Koratala Shiva . Malayalam Super Star Mohan Lal was also acting in this movie and this movie first look was going to be release on NTR's Birth Day.