చెన్నైలో జనతా సందడి

Janata Garage Shooting In Chennai

01:21 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Janata Garage Shooting In Chennai

అవును, ఎన్టీఆర్ ఫిల్మ్ జనతా గ్యారేజ్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఎన్టీఆర్ సెట్స్ కి వెళ్తుండగా ఓ వీరాభిమాని తన సెల్ ఫోన్ తో క్లిక్ మనిపించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. లొకేషన్‌ను చూసి, ఫ్యాన్స్ రకరకాలుగా స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నారు. గతంలో ఈ లొకేషన్స్ లో సూర్య, విజయ్, అర్జున్ హీరోలు చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయని, ఈ ఫిల్మ్ కూడా హిట్ కొట్టడం ఖాయంగా చెబుతున్నారు. మూవీ అంతా జూనియర్ గెడ్డంతోనే కనిపించనున్నాడట. జూన్ 2 వరకు పొలాచ్చితోపాటు చెన్నైలోనూ ఓ ఫైట్ ను చిత్రీకరించనున్నారు. 6 నుంచి అన్నపూర్ణ స్టూడియోలో ఎన్టీఆర్- సమంతల మధ్య సాంగ్ చేయనున్నట్లు యూనిట్ చెబుతోంది. జూన్ ఎడిటింగ్ కి టోటల్ టాకీ పూర్తి అవుతుంది. జులైలో టీజర్, ఆడియో రిలీజ్ ఫంక్షన్కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా చెన్నైలో ఉన్న నేపధ్యంలో సిఎమ్ జయలలితను కల్సి ఎన్టీఆర్ శుభాకాంక్షలు కూడా చెప్పేసిన సంగతి తెల్సిందే.

ఇవి కూడా చదవండి:తల్లితో అక్రమ సంబంధం... భార్యను వ్యభిచారం చేయమని ఒత్తిడి

ఇవి కూడా చదవండి:సమంత మ్యారేజ్ లీక్.. హీరో ఇంట్లో కలకలం

English summary

Young Tiger NTR's Janata Garage Movie shooting was presently going in Chennai and some of the NTR fans met NTR in the Janata Garage Movie sets and taken selfies with NTR.