గ్యారేజ్ తెరవడానికి ముహూర్తం కుదిరింది

Janata Garage Shooting Starts Today

09:52 AM ON 22nd February, 2016 By Mirchi Vilas

Janata Garage Shooting Starts Today

నాన్నకు ప్రేమతో హిట్ తో ఖుషీగా వున్న ఎన్టీఆర్‌ మళ్ళీ మరో చిత్రానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే. అదే నండీ 'జనతా గ్యారేజ్‌'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఎన్టిఆర్ కథానాయకుడుగా సమంత, నిత్యామీనన్‌లు నాయికలుగా నటించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మిం సిటిలో ఈ చిత్రీకరణ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో ప్రముఖ మళయాళ నటుడు మోహన్‌ లాల్‌ ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 12న విడుదల చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

English summary