'జనతా గ్యారేజ్' క్లైమ్యాక్స్ వీడియో

Janatha Garage climax video

02:20 PM ON 14th July, 2016 By Mirchi Vilas

Janatha Garage climax video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం ఈ సినిమాలో ఓ పాటకు సంబంధించి ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ సీన్ లో ఎన్టీఆర్ వేస్తోన్న డ్యాన్స్ మూమెంట్లు ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో కిక్ ఇచ్చాయి. ఈ వీడియోను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుండగానే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ గ్యాంగ్ లో కీలకపాత్రలో నటిస్తున్న ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఓ వీడియోను తన ఫేస్ బుక్ లో అప్లోడ్ చేశారు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో బ్రహ్మాజీ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. వర్షం పడుతున్నప్పుడు గ్యారేజ్ లో జరిగే ఫైట్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. ఆ సెట్ లో జరిగిన యుద్ధ సన్నివేశాలను బ్రహ్మాజీ తన అభిమానులతో పంచుకున్నారు. ఈనెల 22న ఈ చిత్రం ఆడియో రిలీజ్ అవుతుండగా, ఆగస్ట్ 22న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి గ్యారేజ్ క్లైమాక్స్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary

Janatha Garage climax video