నాలుగు రోజులకే 50 కోట్లు దాటేసిన 'గ్యారేజ్'

Janatha Garage crossed 50 crores club within 4 days

12:16 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Janatha Garage crossed 50 crores club within 4 days

సెప్టెంబర్ ఒకటిన విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజ్ రోజున రివ్యూలు ప్రోత్సాహకరంగా లేకపోయినా, గ్యారేజ్ సెన్సేషన్స్ కి బ్రేక్ వేయలేకపోయాయి. ఆఖరికి భారత్ బంద్ కూడా ఎన్టీఆర్ సినిమాను కొంచెం కూడా కదల్చలేకపోయింది. జనతా గ్యారేజ్ నాలుగో రోజుకే 50 కోట్ల షేర్ సాధించిన క్లబ్ లోకి ఎంటర్ అయిపోవడం విశేషం. బాహుబలి తర్వాత అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన మూవీగా జనతా గ్యారేజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బంద్ ఎఫెక్ట్ తో రెండో రోజు కలెక్షన్స్ తగ్గినా, ఆదివారం నాటికి గ్యారేజ్ విపరీతంగా పుంజుకుంది.

1/3 Pages

దీంతో ఏపీ తెలంగాణల నుంచే 35.85 కోట్లు కలెక్షన్స్ రాగా, కర్నాటక, చెన్నై, రెస్టాఫ్ ఇండియాల నుంచి దాదాపు 8 కోట్లు వచ్చాయి. యూఎస్ లో అయితే.. మొదటి వీకెండ్ ముగిసే నాటికే 1.4 మిలియన్ డాలర్లు సాధించగా.. ఇందులో షేర్ 5 కోట్లకు పైగా ఉండనుంది. గతంలో ఎన్టీఆర్ కు 50 కోట్ల క్లబ్ అంటే గగనం అనిపించేది. నాన్నకు ప్రేమతో ఫుల్ రన్ లో ఈ ఫీట్ సాధించగా, ఇప్పుడు 4 రోజుల్లో ఆ క్లబ్ లోకి ఎంటర్ అయిపోయాడు. గ్యారేజ్ సుమారు 50.5 కోట్లు షేర్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిందని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తో తన రియల్ స్టామినా ఏంటో ఎన్టీఆర్ ప్రూవ్ చేశాడని చెప్పొచ్చు.

English summary

Janatha Garage crossed 50 crores club within 4 days. Young Tiger Ntr latest movie Janatha Garage crossed 50 crores club within 4 days.