ఓ రోజు ముందే ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు

Janatha Garage first look on May 19

09:24 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Janatha Garage first look on May 19

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది శుభవార్తే. అనుకున్న దాని కంటే ముందే వస్తున్నాడు ఈ హీరో. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. వాస్తవానికి అదే రోజు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా 'జనతా గ్యారేజ్' ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఒక రోజు ముందుగానే దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మే 19న సాయంత్రం ఆరు గంటలకు జనతా గ్యారేజ్ ఫస్ట్‌ లుక్ విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. జనతా గ్యారెజ్ లో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యమీనన్, మోహన్‌లాల్, ఉన్ని ముకుందన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 12న విడుదల చేయాలని ముందే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఓ రోజు ముందే ఎన్టీఆర్ అభిమానులకు ఫస్ట్ లుక్ చేరువ కానుంది.

English summary

Janatha Garage first look on May 19. Ntr latest movie Janatha garage first look will be on may 19th.