జనతా హీరో మారిపోయాడు.. ఖంగు తినిపించిన కొరటాల!

Janatha Garage hero was changed

12:35 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Janatha Garage hero was changed

అవునా, ఈ వార్త వింటేనే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. అయినా సరే ఇది జీర్ణించుకోక తప్పదనేలా పరిస్థితులు మారాయని అంటున్నారు. అసలు రిలీజ్ కి డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ గొడవేంటి రా బాబూ అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్ళండి అప్పుడు మీకే అర్ధం అవుతుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో హిట్లు సాధించి హ్యాట్రిక్ పై కన్నేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' లో తీవ్రంగా శ్రమిస్తున్నాడని తెల్సు కదా. ఇక మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో మాంచి ఊపుమీదున్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

1/4 Pages

ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరడంతో తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సంచనాలు సృష్టించడంతో సినిమా కూడా ఒక విందులా ఉంటుందని దర్శకుడు కొరటాల చెప్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కూడా. అయితే ఇక్కడో ఐడియా తళుక్కున మెరిసింది అంటున్నారు. అదేమిటంటే, ఈ సినిమా మలయాళ వెర్షన్ క్లైమాక్స్ ను హీరో ఎన్టీఆర్ పాత్రను కాకుండా మోహన్ లాల్ పాత్రను ప్రధానంగా తీసుకొని సినిమా ముగించనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

English summary

Janatha Garage hero was changed