గ్యారేజ్ పాటలకు ముహూర్తం ఖరారు

Janatha Garage movie audio release date fixed

11:13 AM ON 5th August, 2016 By Mirchi Vilas

Janatha Garage movie audio release date fixed

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్నజనతా గ్యారేజ్ చిత్రంపై అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటు ఇండస్ట్రీలో కూడా ఈ మూవీ గురించి ఎదురుచూపులు సరేసరి. కొరటాల శివ దర్శక త్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 12న హైదరాబాద్ లో విడుదల చేస్తారు. వచ్చే నెల 2న జనతా గ్యారేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చితాన్ని విడుదల చేస్తున్నారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కాజల్ ఓ ఐటెం సాంగ్ లో మెరుస్తోంది. మొత్తానికి పాటల ముహూర్తం ఖరారవ్వడంతో అభిమానుల్లో ఉత్సాహం పెల్లుబిక్కుతోంది.

English summary

Janatha Garage movie audio release date fixed