బాప్ రే... 'గ్యారేజ్' ఫస్ట్ టికెట్ రూ. 31 వేలట!

Janatha Garage movie first ticket was sold by 31 thousand

01:09 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Janatha Garage movie first ticket was sold by 31 thousand

సినిమా టికెట్ రేటు చూస్తే గుండె గుభేల్ మంటోంది. అంత రేటు పెట్టి ఎవరు కొంటారని అనుకుంటే పొరపాటే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో మోహన్ లాల్ కీలక రోల్ పోషిస్తున్న 'జనతా గ్యారేజ్' మూవీ ఫీవర్ ఫ్యాన్స్ ని బానే వెంటాడుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ మొదలు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక తారక్ అభిమానులైతే ఎప్పుడు థియేటర్ కి వస్తుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం బెనిఫిట్ షో చూడాలన్న ఆరాటం కూడా బలంగా కనిపిస్తోంది. 31న అర్ధరాత్రి ఒంటి గంట, 4 గంటలకు రెండు షోలను ఏర్పాట్లు చేశారు. చాలా చోట్ల టిక్కెట్లు అమ్మకాలు జరిగిపోయాయి కూడా. కోలీవుడ్ లోనూ గ్యారేజ్ ఫీవర్ తారాస్థాయికి చేరింది.

చెన్నైలోని ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీలో జనతాగ్యారేజ్ బెనిఫిట్ షో టికెట్లను తెలుగుదేశం పార్టీ చెన్నై యువసేన విభాగం వేలం వేసింది. అత్యధికంగా ఫస్ట్ టికెట్ రూ. 31 వేలకు ఒక అభిమాని దక్కించుకున్నాడు. ఇక సెకండ్ టికెట్ రూ.17,500 కాగా, మూడో టికెట్ ఏకంగా రూ.13000కు వెళ్లినట్టు టాక్. ఇక మోహన్ లాల్ అభిమానులు అయితే కేరళలో భారీ ఓపెనింగ్ కు ప్లాన్ చేశారు. కర్ణాటకలోనూ ఇదే హంగామా! ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ డే 20 కోట్లు రాబట్టవచ్చున్నది ట్రేడ్ వర్గాల అంచనాగా వుంది. శుక్రవారం వామపక్షాల దేశవ్యాప్త బంద్ తో కలెక్షన్స్ కాస్త డ్రాపైనా, వీకెండ్ కు పుంజుకోవచ్చుని అంటున్నారు. హిట్ టాక్ వస్తే, ఓపెనింగ్- వీకెండ్ కలిసి 50 కోట్ల మార్క్ తాకే ఛాన్స్ వుందని లెక్కలు వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నువ్వా నేనా అంటూ తలపడ్డాయి(ఫోటోలు)

ఇది కూడా చదవండి: యాపిల్ కంపెనీకు దిమ్మ తిరిగే షాక్!

ఇది కూడా చదవండి: శ్రీకృష్ణుడు విగ్రహం ఖరీదు తెలిస్తే గుండె జారిపోద్ది(వీడియో)

English summary

Janatha Garage movie first ticket was sold by 31 thousand. Janatha Garage first ticket was sold in Chennai SRM university for 31 thousand and second ticket was 17,500 and third ticket was 13 thousand.