షాకింగ్ న్యూస్: జనతా గ్యారేజ్ పూర్తి స్టొరీ లీక్!

Janatha Garage movie story leaked

11:26 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Janatha Garage movie story leaked

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీమంతుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ హీరో కాగా, హీరోయిన్ గా సమంత నటిస్తోంది. ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై ఉన్న అంచనాల దృష్ట్యా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయ్యింది. ప్రస్తుతం అది సోషల్ మీడియా అలాగే వెబ్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో మరో హీరోయిన్ నిత్యామీనన్ ముఖ్యపాత్రలో కనిపించబోతోంది. ముంబైలో గ్యారేజ్ ను రన్ చేసే మోహన్ లాల్ కు మాఫియా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆయన మేనల్లుడు ఎన్టీఆర్. కొడుకు ముకుందన్. మోహన్లాల్ అల్లుడు ఎన్టీఆర్ పై ఎక్కువ అభిమానం చూపించడం ముకుందన్ కు ఇష్టం ఉండదు. మరో వైపు మోహన్ లాల్ ను పాత శత్రువులు చంపేందుకు వెంటాడుతూ ఉంటారు. ఎన్టీఆర్ మోహన్ లాల్ మాఫియా ఫ్లాష్బ్యాక్ గురించి తెలుస్తుంది. మామయ్యను కాపాడుకునేందుకు ఎన్టీఆర్ మాఫియా పై పడతాడు. ఐఐటీ స్టూడెంట్ అయిన ఎన్టీఆర్ తన మామను మాఫియా నుండి ఎలా కాపాడుకుంటాడు? ఆ క్రమంలో సమంతను ఎలా ప్రేమలో పడేశాడు అనేది కథ అంటూ ప్రచారం జరుగుతోంది.

కథ సింపుల్ గా ఉన్నా దర్శకుడు కొరటాల శివ దీన్ని చించి చాటంత చేసి, మాస్ మసాలా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగష్టులో సినిమా వచ్చే వరకు అంచనాలు అలా అలా పెరుగుతూనే ఉంటాయి.

English summary

Janatha Garage movie story leaked