టీజర్ సైతం రికార్డులు బద్దలు కొడుతోంది

Janatha Garage movie teaser creating records

12:19 PM ON 8th July, 2016 By Mirchi Vilas

Janatha Garage movie teaser creating records

రికార్డులు బద్దలు కొట్టడం అంటే, కేవలం సినిమా కలెక్షన్లలోనే కాదు, టీజర్ లో సైతం అంటూ ఎన్టీఆర్ న్యూఫిల్మ్ జనతా గ్యారేజ్ తో నిరూపించాడు. రంజాన్ సందర్భంగా రిలీజైన టీజర్ రికార్డులు బద్దలుకొడుతోంది. కేవలం 6 గంటల్లో పది లక్షల వ్యూస్.. 45,000 లైక్స్ వచ్చాయి. ఇక 24 గంటల్లో సుమారు 20 లక్షల మంది ఈ టీజర్ ని తిలకించారు. అతి తక్కువ టైమ్ లో ఈ రికార్డు సాధించడంతో యూనిట్ ఫుల్ఖుషీ! ఇక జూనియర్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. టాలీవుడ్ లో ఇదో రికార్డుగా చెబుతున్నారు. రికార్డ్ విషయానికి వస్తే గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ రిలీజైన 24 గంటల్లో 41 వేల లైక్స్ తో సత్తా చాటింది.

అయితే జనతా గ్యారేజ్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ కేవలం 100 నిమిషాల్లో 40 వేలకు పైగా లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. అంతేకాదు 15 గంటల్లో 10 లక్షల పైగా వ్యూస్ సాధించింది ఈ గ్యారేజ్. ఇక మలయాళం టీజర్ విషయానికొస్తే.. 24 గంటల్లోనే 5 లక్షలు హిట్స్ వచ్చాయి. ఇది కూడా ఓ రికార్డ్! ఇప్పటికే జనతా గ్యారేజ్ అన్ని ఏరియా హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. టీజర్ తో అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయ్యాయి. ఇక అభిమానులు ఆనందానికి అవధుల్లేవ్.

English summary

Janatha Garage movie teaser creating records