గ్యారేజీ టీజర్ 6న వచ్చేస్తొందోచ్!

Janatha Garage movie teaser on july 6

03:19 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Janatha Garage movie teaser on july 6

'నాన్నకు ప్రేమతో' విజయాలతో ఫామ్ లోకి వచ్చేసిన ఎన్టీఆర్. ఇప్పుడు జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి, కొరటాల శివ దర్శకుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లు. మోహన్ లాల్ కీలక పాత్రధారి. ఇక చిత్రీకరణ తుదిదశకు చేరుకోవడంతో ఈనెల 6న టీజర్ విడుదల చేస్తారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 22న ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ లోనే పాటల విడుదల కార్యక్రమం ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది.

ఎన్టీఆర్ ని సరికొత్తగా ఆవిష్కరించే చిత్రమిది. ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులకే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాం. మోహన్ లాల్ పాత్ర ప్రధాన ఆకర్షణ. ఆయన స్వయంగా డబ్బింగ్ చెప్పుకొంటున్నారు. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చిత్రబృందం అంటోంది. ఇక ఈ చిత్రం పై భారీ అంచనాలు పెంచుకున్న అభిమానులు యమ ఖుషీలో వున్నారు.

English summary

Janatha Garage movie teaser on july 6