నేచర్ ని ప్రేమించమంటున్న జనతా ట్రైలర్(వీడియో)

Janatha Garage movie trailer

12:19 PM ON 13th August, 2016 By Mirchi Vilas

Janatha Garage movie trailer

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన జనతా గ్యారేజ్ ట్రైలర్ నిన్న రాత్రి విడుదలై అప్పుడే సంచలనం సృష్టిస్తుంది. సోషల్ కాజ్ తో సినిమాలను చేయడమే తన ధ్యేయంగా పెట్టుకున్న కొరటాల శివ.. ఇప్పుడు నేచర్ లవర్ గా ఎన్టీఆర్ ను అద్భుతంగా తీర్చిదిద్దాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ విషయానికి వస్తే ఆనంద్(ఎన్టీఆర్) కు మొక్కలంటే చాలా ఇష్టం. అలాగే జనతా గ్యారేజ్ అధినేత మోహన్ లాల్ కు మనుషులంటే చాలా ఇష్టం. ముంబైలో ఎక్కడో నేచర్ ని డిస్ర్టాయ్ చేయకండి అంటూ యుద్ధం చేసే ఒక స్టూడెంట్.. అలాగే హైదరాబాద్ లో మనుషుల కోసం పోరాడే ఈ పెద్దాయన. ఇద్దరూ పోరాడేది ఇతర ప్రాణుల కోసమే. వీరిద్దరినీ నేచర్ కలిపింది. ఆ తరువాత వారిద్దరూ కలిసి ఏం చేశారనేది మిగిలిన కధ.

ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలంటే కాజ్ లేకుండా ఏదో ఫైట్ల మీద ఫైట్లు పెట్టేయడం అన్నట్లుండేది. కాని కొరటాల శివ ఆ చరిత్ర తిరగరాస్తున్నాడు. శ్రీమంతుడు తరువాత మరోసారి సోషల్ కాన్షియస్ గా ఈ సినిమా తీస్తున్నాడంటే.. దీనికి తోడు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త బాడీ లాంగ్వేజ్.. సమంత హాట్ లుక్స్.. నిత్యా మీనన్ హోమ్లీ లుక్.. మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్.. అన్నీ అదరిపోయాయ్. వీటికి తోడుగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్.. తిరు సినిమాటోగ్రాఫీ.. అదరగొట్టేశాయి. బడ్జెట్ బీభత్సంగా పెట్టారని ట్రైలర్ చూస్తేనే అర్దమైపోతోంది. ఒకసారి ట్రైలర్ పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

English summary

Janatha Garage movie trailer