'గ్యారేజ్‌' రిలీజ్‌ డేట్‌ చెప్పేశారు!

Janatha Garage release date announced

04:57 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Janatha Garage release date announced

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 25వ చిత్రం 'నాన్నకుప్రేమతో' సంక్రాంతి కానుకగా విడుదలై ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో 'జనతా గ్యారేజ్‌' చిత్రంలో నటించబోతున్నాడు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించి గ్యారేజ్‌ సెట్‌ వేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఘాటింగ్‌ మొదలు కాకముందే అప్పుడే డేట్‌ అనౌన్స్‌ చేసేశారు. ఎన్టీఆర్‌ గత రెండు చిత్రాలు టెంపర్‌, నాన్నకుప్రేమతో చెప్పిన టైమ్‌కి రిలీజ్‌ చేసేసి సూపర్‌ హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు 'జనతా గ్యారేజ్‌' కూడా ఆగష్టు 12న రిలీజ్‌ చేయబోతున్నామని ప్రకటించారు. అంటే ఈ చిత్రం కూడా హిట్‌ అవ్వాలనే ఉద్ధేశ్యంతోనే ఇలా ముందుగానే రిలీజ్‌ డేట్‌ ప్రకటించారని అర్ధమవుతుంది.

English summary

Young Tiger Ntr upcoming movie Janatha Garage release date was announced. Koratala Siva will direct this movie. Janatha Garage will release on August 12th.