ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ఒకరోజు ముందే 'జనతా గ్యారేజ్'!

Janatha Garage release was preponed

04:24 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Janatha Garage release was preponed

అదేంటి సెప్టెంబర్ 2న 'జనతా గ్యారేజ్' సినిమా రిలీజ్ అయితే ఒకరోజు ముందే జనతా గ్యారేజ్ ఏంటీ అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే ఒకరోజు ముందే 'జనతా గ్యారేజ్' ను చూసేయొచ్చు. అసలు విషయంలోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆడియో ఈనెల 12న అంగరంగ వైభవంగా విడుదలైంది. ఈ ఆడియో వేడుకలోనే సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసేసారు. జనతా గ్యారేజ్ ను సెప్టెంబర్ 2న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు.

అయితే ఇప్పుడు అదే రోజున భారత్ బంద్ కావడంతో ఈ చిత్ర నిర్మాతలు ఒక రోజు ముందే సినిమాని రిలీజ్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారట. భారత్ బంద్ కారణంగా జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా పడుతుందేమో అని ఎన్టీఆర్ అభిమానులు తెగ డైలామాలో పడిపోయారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ ముందుకు జరపడంతో ఎన్టీఆర్ అభిమానులకు పండగలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలుగా వ్యవహరించారు. సమంత, నిత్య మీనన్ ను ఎన్టీఆర్ సరసన హీరోయిన్లుగా నటించారు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

English summary

Janatha Garage release was preponed. Young Tiger Ntr latest movie is Janatha Garage. This movie is directed by Koratala Siva. And this movie release date was pre poned.