జనతా గ్యారేజ్ టైటిల్ సాంగ్ వీడియో అదుర్స్(వీడియో)

Janatha Garage title song video leaked

01:27 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Janatha Garage title song video leaked

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 26వ చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో మూడో షెడ్యూల్ సంబంధించి ఓ వీడియో లీకైంది. ఈ షెడ్యూల్ లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చిత్రీకరించిన టైటిల్ సాంగ్ వీడియో అని తెలిసింది. పూర్తి మాస్ బీట్ లో ఉన్న ఈ పాటని ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాడాడు. ఈ వీడియోని చాలా దూరం నుంచి చిత్రీకరించడంతో ఎన్టీఆర్ లుక్ క్లియర్గా కనిపించలేదు కానీ..

ఇందులో అతను ఓ సింపుల్ స్టెప్ వేస్తూ కనిపించాడు. ఓ అభిమాని తన ఫోన్లో రికార్డ్ చేసి ఈ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒకసారి మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వేసేయండి.

English summary

Janatha Garage title song video leaked