గంగా హారతికి రానున్న జపాన్‌ అధ్యాక్షుడు

Japan Prime Minister Shinzo Abe To Attend Ganga Aarti

12:08 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Japan Prime Minister Shinzo Abe To Attend Ganga Aarti

జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబె భారత ప్రధాని నరేంద్రమోడి తో కలసి వారణాసి లోని 'గంగాహారతి' కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత పర్యటనలో భాగంగా జపాన్‌ అధ్యక్షుడు రానున్న సందర్భంగా మోడి షింజోఅబె ను గంగాహారతి కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా కోరారు. విమాన మార్గం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని బబట్‌పూర్‌ విమానాశ్రయం కు వచ్చి అక్కడి నుండి జపాన్‌, భారత్‌ ప్రధానులు రోడ్డు మార్గం ద్వారా వారణాసిలోని ప్రముఖ పవిత్రమైన దశశ్వమేధ్‌ ఘాట్‌ కు చేరుకుంటారు. ఈ నియోజకవర్గం నుండే నరేంద్రమోడి పార్లమెంట్‌ కు ఎన్నిక కావడం విశేషం.

భారత్‌, జపాన్‌ ప్రధాన మంత్రులు వస్తుండంతో నీటిలో తేలే స్టేజ్‌ను భారత ఆర్మీకు చెందిన ఇంజనీర్లు రూపొందించినట్లు సమాచారం.

గంగాహారతి ముగించుకున్న తరువాత జపాన్‌ మంత్రి వారణాసి లో తరతరాలుగా నివసిస్తున్న భారత, జపాన్‌ ప్రజలను కలుసుకోనున్నారు. అతి పురాతనమైన వారణాసి సిటీ యొక్క చరిత్రను జపాన్‌ ప్రధాన మంత్రికి వివరించనున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడితో పాటు ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, గవర్నర్‌ రామ్‌నాయక్‌, వివిధ రాష్ట్రమంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఆ తరువాత రాత్రి ఢిల్లీకి విమానంలో తిరిగి ప్రయాణం కానున్నారు.

English summary

Japan Prime Minister Shinzo Abe To Attend Ganga Aarti along with Indian Primeminister Narendra Modi