ట్యూనా@78 లక్షలు

Japanese sushi chain pays 78 lakhs for a tuna fish

06:33 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Japanese sushi chain pays 78 lakhs for a tuna fish

చేపలు మనం రోజు తింటూ ఉంటాం.. మనకు తెలిసి అతి ఖరీదైన చేప పులస. దీని ఖరీదు వేలల్లో ఉంటుంది. కానీ దీనిని తలదన్నే చేపలు కూడా ఉన్నాయి. అవే ట్యూనా ఫిష్. ఇది ఎక్కువగా జపాన్ తీరంలో దొరుకుతుంది. ఈ అరుదైన చేపకు అక్కడ రికార్డు స్థాయి ధర పలుకుతుంది. ప్రతి ఏటా జనవరి 1న మొదటి ట్యూనా చేపను అక్కడ వేలం వేస్తుంటారు. ఈ ఏడాది ట్యూనా చేప ఎంత ధర పలికిందో తెలుసా. అక్షరాలా 78 లక్షల రూపాయలు. జపాన్‌లోని ఓ హోటల్ చైన్ యజమాని దీనిని కొన్నాడు. ఈ చేప బరుు 200 కిలోలు. అంటే, కిలో చేప ఖరీదు దాదాపు రూ. 39 వేలన్నమాట. సుషి జన్మై అనే రెస్టారెంటు చైను యజమాని కియోషి కిమురా ఈ ట్యూనా చేప మీద మనసు పడ్డాడు. టోక్యోలో అత్యంత ప్రసిద్ధి చెందిన చేపల మార్కెట్‌లో కొత్త సంవత్సరంలో జరిగిన తొలి వేలంపాటలో ఈ చేపను ఆయన పాడుకున్నాడు. అది అనుకున్నదాని కంటే కాస్త ఎక్కువ ఖరీదే పలికిందని, కానీ, దాని రంగు, రూపం, క్వాలిటీ.. అన్నీ చూస్తే మాత్రం అంత ధర పెట్టాలనే అనిపించిందని కిమురా చెప్పాడు. తన కస్టమర్లు సంతోషంగా ఉండాలనే అనుకున్నానని, అందుకే సుకిజి చేపల మార్కెట్‌లో తొలి ట్యూనా చేపను తానే తెచ్చానని అన్నాడు. నీలిరంగు తోక ఉన్న ఈ చేపలంటే జపనీయులకు ఎంత మక్కువ. గత సంవత్సరం నిర్వహించిన వేలంలో పలికిన ధరకు మూడురెట్లు ఎక్కువ ధర పెట్టి కిమురా ఈ చేపను కొన్నాడు. ట్యూనా తొలి వేలంలో ఎక్కువ డబ్బు పెట్టడం జపనీయులకు అలవాటు. 'గోషుగి సోబా' అనే ఆచారం ప్రకారం ఇలా పెడతారు. ఎంత ఎక్కువ డబ్బు పెట్టి కొంటే, ఆ ఏడాది తమ వ్యాపారం అంత బాగుంటుందని వాళ్లు అనుకుంటారు

English summary

Owner of the sushi restaurant chain Sushi Zanmai, displays a 441-pound bluefin tuna at his main restaurant near Tokyo's Tsukiji fish market on Jan. 5, 2016.This Fish was sold for 78 lakh rupees