ఈ హోటల్ రూల్స్ వేరయా..

Japanese weird hotel now changed some rules

11:11 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Japanese weird hotel now changed some rules

'ది అమృత' అనే ఇండియన్ పేరుతో వెలసిన జపాన్ లోని తొలి న్యూడ్ డైనర్స్ హోటల్ తన రూల్స్ ని కొంచెం సడలించింది. ఈ హోటల్ కి స్థూలకాయులను, 60 ఏళ్ళు దాటిన వారిని అనుమతించరాదంటూ వున్న నిబంధనను కొద్దిగా సడలించారు. తమ ఎత్తు సగటు బరువు కన్నా 15 కిలోలు ఎక్కువగా బరువున్న కస్టమర్లను అనుమతించరాదని గత నెలలో ఇక్కడ గట్టి నిబంధన విధించారు. అయితే దీనివల్ల మొదటికే మోసం రావచ్చునని, డిమాండ్ తగ్గిపోతుందని భావించిన హోటల్ యాజమాన్యం, ముందుగా తేరుకుంది. అందుకే ఇప్పుడు తమ విధానాలు మార్చుకుంది.

ఎక్కువమంది కస్టమర్లు వచ్చేలా చూస్తోంది. 60 ఏళ్ళు దాటినా రావచ్చునని అంటోంది. అయితే, శరీరంపై టాటూలు ఉన్నవారికి మాత్రం పర్మిషన్ లేదట. అవి ఉంటే క్రిమినల్స్ అనే అభిప్రాయం జపాన్ లో ఉందట. ఇక ఇక్కడికి వచ్చేవాళ్ళు తమ మొబైల్ ఫోన్లను వాడడానికి వీల్లేదట. అలాగే చైర్ రిజర్వ్ చేసుకునేటప్పుడు ముందుగా అడ్వాన్స్ సొమ్ము చెల్లించాలి. ఒకవేళ అనుమతి లభించకపోతే ఆ సొమ్మును తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదట. అయినా ఈ న్యూడ్ డైనర్స్ హోటల్ ఈ మధ్య ప్రజలతో కిటకిటలాడుతోంది. కలర్ ఫుల్ గా మారిందట.

English summary

Japanese weird hotel now changed some rules