బాలయ్య 100 వ చిత్రంలో విలన్ గా జగపతి బాబు 

Japathi Babu In Balakrishna 100th movie

06:43 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Japathi Babu In Balakrishna 100th movie

నట సింహం బాలకృష్ణ సినిమా వస్తుందంటే చాలు నందమూరి అభిమానులకు పండుగే. అలాంటిది బాలయ్య , బోయపాటి కాంబినేషన్ అయితే ఆ ఆనందం రెట్టింపు ఆవుతోందనే చెప్పాలి.గతం లో బూయపతి , బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సింహ , లెజెండ్ వంటి సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో వేరే చెప్పనక్కర్లేదు. బాలయ్య బాబును పవర్ ఫుల్ గా స్క్రీన్ పై ప్రెసెంట్ చెయ్యడంలో బోయపాటి ఒక అడుగు ముందుంటాడు. ఇది ఇలా ఉండగా బాలకృష్ణ తన 100 వ సినిమా బాద్యతను బోయపాటి పై పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రను ఎవరు పోషిస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం లో జగపతి బాబు పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే బాలయ్య బాబు లెజెండ్ సినిమాలో విలన్ గా నటించాడు. బాలయ్య 100 వ చిత్రంలో విలన్ గా జగపతి బాబు పాత్రను బోయపాటి అత్యంత శక్తీవంతంగా తీర్చిద్దిదే పని లో పడ్డాడు అని సమాచారం .

English summary

Boyapaati to direct balakrishna 100 th film. Jagapathi Babu to play villian role in balakrishna 100th movie.