క్రిస్మస్‌కి ''జతకలిసే''

Jatha Kalise releasing on December 25th

07:12 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Jatha Kalise releasing on December 25th

'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పరిచయమై ఆ చిత్రంతోనే మంచి గుర్తింపు పొందిన నటి తేజస్వి మడివాడ. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసి రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్‌క్రీమ్‌' చిత్రంతో హీరోయిన్‌గా మారి తన అందాలను ఆరబోసింది. ఇప్పుడు తాజాగా 'జతకలిసే' చిత్రంలో హీరోయిన్‌గా నటించి మన ముందుకు వస్తోంది. అశ్విన్‌, తేజస్వి హీరోహీరోయిన్లుగా వారాహి చలనచిత్రం, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యుక్త క్రియేషన్స్‌ పతాకం పై నరేష్‌ రావూరి నిర్మించిన చిత్రం 'జతకలిసే'. పరుచూరి బ్రదర్స్‌, చిన్నికృష్ణ వంటి కథారచయితలు రామ్‌గోపాల్‌వర్మ, గుణశేఖర్‌ వంటి పెద్ద డైరెక్టర్స్‌తో పని చేసిన రాకేష్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

రంపచోడవరం, రాజమండ్రి, వైజాగ్‌, హైదరాబాద్‌, అన్నవరం వంటి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కి కానుకగా డిసెంబర్‌ 25 న విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ఆడియోని విడుదల చేయబోతున్నారు.

English summary

Jatha Kalise releasing on December 25th. Aswin and Tejaswi are playing lead roles in this film.