మోడీకి సవాల్ విసురుతున్న పాక్ మాజీ క్రికెటర్

Javed Miandad shocking comments on Narendra Modi

04:34 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Javed Miandad shocking comments on Narendra Modi

సర్జికల్ ఆపరేషన్ తర్వాత మన్ను తిన్న పాములా వున్న పాకిస్తాన్ చేస్తున్న చేష్టలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో పాక్ ఏకాకిగా మారుతున్నా, రకరకాల కవ్వింపు చర్యలు చేస్తూనే వుంది. తాజాగా ప్రధాని మోడీకి దమ్ముంటే యుద్ధానికి సిద్ధం కావాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ సవాలు విసిరాడు. ఇంతకీ ఇతగాడు, క్రికెట్ ఆడే రోజుల్లోనూ మియాందాద్ తరచూ భారత్ క్రీడాకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడు. 1992 ప్రపంచకప్ లో భారత వికెట్ కీపర్ కిరణ్ మోరేపై తిట్ల పురాణం అందుకుని వార్తల్లోకి ఎక్కాడు. ఆస్ట్రేలియా పేసర్ డెన్నిస్ లిల్లీపైనా బ్యాట్ తో ఎగబడ్డాడు. తాజాగా ఓ పాకిస్థానీ టీవీ ఛానల్ తో మాట్లాడిన ఆయన తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు.

ఉతుత్తి బెదిరింపులతో భయపడి పారిపోయే వాళ్లం కాదని, బలిదానాలకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రగల్భాలు పలికాడు. భారత్ చేసే ఉత్తుత్తి బెదిరింపులకు పాక్ భయపడదు. తన ప్రతిస్పందనను చేతల్లో చూపిస్తుంది అని పేర్కొన్నాడు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నారన్నాడు. ఇక పాక్ స్టార్ బ్యాట్స్ మన్ షాహిద్ ఆఫ్రిది లాంటి వాడు పాక్ శాంతిని కోరుకుంటోందని చెబుతుంటే మరోపక్క మియాందాద్ యుద్ధానికి రమ్మంటూ నోరు పారేసుకుండడంపై స్వదేశంలోనే ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary

Javed Miandad shocking comments on Narendra Modi