అమ్మా! .. మజాకా!!

Jaya Lalita Birthday Celebrations

01:53 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Jaya Lalita Birthday Celebrations

పూర్వం రాజులు పరిపాలించేటప్పుడు రాజు తలచుకుంటే, దెబ్బలకు కొదవ అనేవారు. మరి ఇది ప్రజాస్వామ్యం కదా ... ప్రజా ప్రతినిధులు  తలచుకుంటే, దేనికీ కొదవలేదు ... ఏదైనా చేసేస్తారు ... ఎలాగైనా చేసేస్తారు ... ఆ తర్వాత లబో దిబో మనేది ప్రజలే .... పురుచ్చి తలైవి గా వినుతికెక్కిన తమిళనాడు సిఎమ్ జయలలిత తలచుకుంటే, సినీ రికార్డులే కాదు అన్ని రికార్డులు బద్దలవుతాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఈ అమ్మ పుట్టినరోజు వేడుక రాష్ట్ర పండుగగా మారిపోయింది. అందుకే విద్యుత్ కాంతులీనాయి. ఫలితం, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జయమ్మ పుట్టిన రోజైన ఫిబ్రవరి 24వ తేదీన రాష్ట్ర దినసరి విద్యుత్ వినియోగం 14,538 మెగావాట్ల ని లెక్క తేలింది. అంటే మొత్తం ఆ రాష్ట్ర చరిత్రలో ఆ ఒక రోజు కాలంలో గరిష్ట విద్యుత్ వినియోగంగా రికార్డు నమోదైంది.

అంతవరకూ బానే వుంది. అయితే  తరుముకొస్తున్న వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం వుండడంతో విద్యుత్ బోర్డు అధికారుల్లో ఆందోళన మొదలైంది. తమిళనాడులో రోజుకు సుమారు 12,500 మెగావాట్ల విద్యుత్ అవసరమట.  ఒకసారి వెనక్కి వెళితే,  2014 జూన్ 24 రాత్రి 8.25 గంటలకు విద్యుత్ వినియోగం 13,775 మెగావాట్లకు పెరిగింది. ఇదే ఇప్పటివరకు గరిష్ట విద్యుత్ వినియోగంగా నమోదు కాగా, గత 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు విద్యుత్ వినియోగం 14,079 మెగావాట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పుట్టినరోజైన ఫిబ్రవరి 24వ తేది రాత్రి 7.10 గంటలకు విద్యుత్ వినియోగం 14,538 మెగావాట్లకు చేరువైంది. ఇది తమిళనాడు చరిత్రలోనే గరిష్ట వినియోగంగా నమోదైందని అధికారులు అంటున్నారు. ఈ స్థాయికి విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు ఉంటే తప్ప, ఈ వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించలేమని అంటున్నారు. పైగా  ఈ  వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగి, ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండడంతో లోటును ఎలా భర్తీచేయాలా అని అధికారులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. జయమ్మ కు మాత్రం ఇదేమీ పట్టదు కదా .... తేడా వస్తే , ఆగ్రహించి , విశ్వరూపం చూపించడం తప్ప.

జయలలిత పుట్టిన రోజు సంబరాలు స్లైడ్ షో లో చుడండి... 

1/10 Pages

పెళ్లిలోనూ అమ్మే

ఏఐఏడిఎంకే పార్టీ అధినేత్రి జయ లలిత 68వ పుట్టిన రోజు సందర్భంగా 68 జంటలకు ఒకేసారి పెళ్ళిలు చేసారు. కొత్త జంటలకు జయ లలిత ఫోటో ఉన్న టోపీ లు పెట్టి మరీ తమ ఏఐఏడిఎంకే పార్టీ కార్యకర్తలు తమకు జయ పట్ల ఉన్న అభిమానాన్ని చాటారు. 

English summary

Tamilnadu Chief Minister Jaya Lalitha 68th Birthday Celebrations were done in a grand manner in Tamilnadu.Soo many party members and her fans have celebrated Jaya Lalitha Birth Day.Tamilnadu Government has released soo many schemes on her birthday.Due to her Birthday 14538 Mega Watts of Power was consumed all over the state, this was highest ever recored in Tamilnadu state history.